Thursday, October 27, 2011

శ్రీలు పొంగిన జీవగడ్డై.....

ఇది ఆగష్ట్ 15 న చేసిన డాన్స్......
 కుడివైపు ముందు ఉన్నది విరాజిత.....

Tuesday, May 3, 2011

తరలి వెళ్ళే పెళ్ళి కుమారుని సవారియా.......

ఇది విద్యార్ధి సృజన కుటీర్ స్కూల్ లో జరిగిన "సందడి-2011" ప్రోగ్రామ్‌లో
నా చిన్న కూతురు చేసిన డాన్స్.
ఎడమ పక్క మొదటి జంటలో అబ్బాయి(తెల్ల డ్రెస్) రోల్ చేసింది........

Thursday, January 20, 2011

రాశులు 13.... వృత్తంలో 400 డిగ్రీలు...

పదమూడవ రాశి గురించి సుమారు వంద సంవత్సరాల క్రితమే చెప్పబడింది.
అదే సమయంలో ఒక వృత్తంలో కోణాల మొత్తం 400 డిగ్రీలు అని కూడా చెప్పబడింది.
మానవులు నివశించేది మూడవ డైమెన్షన్ అయితే.....
వీళ్ళని శాసించే వాళ్ళు నాల్గవ డైమెన్షన్ లో ఉంటారనీ కనుక్కుంటారు...
పరిశోధకులు కేవలం  రీ-సెర్చ్ (అంటే ఉన్నదానిని మళ్ళీ కనుగొనడం) మాత్రమే
చేస్తున్నారు తప్పితే కొత్తగా ఏమీ కనిపెట్టటం లేదనేది నా అభిప్రాయం.
ఆధునికత వెర్రితలలు వేస్తున్న ప్రస్తుత తరుణంలో...
ఇలాంటివి అసంభవం అనిపించినా.... వీటన్నింటిని adjustements అంటారు.
మానవ సమాజానికి ఉపయోగకరంగా ఉండేందుకు
Higher Planes ఉండే కొంతమంది చేస్తున్న విశ్వకార్యం.
నేను చదివిన ఒక చిన్న వ్యాసం తర్వాతి పోస్టులో....

Friday, February 26, 2010

కుండలినియనగానేమి?

ఒకానొక కాలములో కుండలినీశక్తిని సాధించడం అన్నది యోగసాధనలో అత్యంత ఉన్నతమైన స్థితి.
కాని మారిన కాల సమీకరణాలలో ( నేటి పరిస్థితులలో ) కుండలినిని సాధించడం అన్నది మొదటి మెట్టు.
నాకు లభించిన అనేకమైన పుస్తకాలలో, నేను చదివిన కుండలిని సంబంధిత సాహిత్యంలో నాకు బాగా నచ్చిన, ఏ మతలబులూ, మెలికలూ లేని ఈ వ్యాసం సాధకులకి యెంతోకొంత ఉపయోగపడుతుంది.
ఇది నేను ఎక్కడ రాసుకున్నానో నాకు గుర్తులేదు.

చిన్న అభ్యర్ధన ఏమిటంటే ఇది ఎవరు రచించారో ఎవరికైనా తెలిస్తే నాకూ తెలియచేయండి.

Thursday, February 11, 2010

ఒక హడావిడినుంచి........ ఇంకొక హడావిడిలోకి..............

రోజు 'మహాటీవీ' లో సంపూర్ణ కల్కినామస్మరణ జరిగింది.
ఎవడిదైనా వ్యాపారమే, అది కాషాయం కట్టిచేసినా, టక్ చేసి టై పెట్టి చేసినా...
అన్ని టీవీలూ మొదట్లో కల్కిని బాగానే ప్రమోట్ చేసినై.
తెల్లవారుఝామునే ప్రవచనాలు... ఆధ్యాత్మికబోధలు.......
తదితర కార్యక్రమాలతో ఊదరగొట్టినై.
ప్రజలని పుణ్యమార్గాన నడిపించినై. ఎంఓయు బాగున్నన్ని రోజులూ
బ్రహ్మాండంగా నడిచింది. ఎందుకు, ఎక్కడ, ఎలా తేడా వచ్చిందో
పాపం కల్కి బతుకు చానళ్ళ పాలైంది. క్షమించాలి .... చానల్ పాలైంది.

దీని ముందు హడావిడి తెలంగాణ వివాదం. అంతకంటే ముందు
ఇంకొక వివాదం. అంతక ముందు ఇంకోటి... ఒక వివాదంలోంచి ఇంకో
వివాదంలోకి ప్రేక్షకుల / పాఠకుల నిరంతర ప్రయాణమే బతుకుకి
అర్ధంలా కనిపిస్తుంది. నాకైతే టీవీలు, పేపర్లు, రేడియోలు
లేని రోజుల్లో బతికిన బతుకే బతుకు అనిపిస్తుంది. టెన్షన్లూ ఉండేవి కావు.
దీనిమీద నాకొక రిసెర్చ్ టాపిక్ దొరికింది. 'వార్తలు - ఆరోగ్యంపైన దాని ప్రభావం'
సైకోసోమాటికల్ గా తీసుకుంటే దీనికొక బేస్ దొరుకుతుందనుకుంటా....

చాలామందికి రంధ్రాన్వేషణ ఒక వినోదం. 'వినేవాడు వి.పి. ఐతే చెప్పేవాడు
ఏమైనా చెబుతాడు ' అనేది నా అభిప్రాయం.
Justify Full

మరి మీరేమంటారు?

Wednesday, February 10, 2010

రవీంద్రులవారికి క్షమాపణలతో...................

రవీంద్రులవారి గీతాంజలి విశ్వవిఖ్యాత రచన అన్నది అందరికీ తెలిసిన విషయమే.
అయితే అందులోని "ఎక్కడ మనసు నిర్భయంగా......" అన్న భాగంలో
రవీంద్రులవారి ప్రార్ధన ఆ లార్డ్ చెవికెక్కినట్టు లేదు. అందుకనే ఇంకొంచెం విపులంగా
విన్నవించుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమోనని
నా ఈ చిన్న ప్రయత్నం.

"ఎక్కడ పుట్టుకతోనే మనిషి కులమతజాతివర్గవర్ణాలు నిర్దేశింపబడవో
ఎక్కడ బాల్యం కన్నవాళ్ళ అధికార దర్పానికి గురికాదో
ఎక్కడ విద్యాలయాల దరఖాస్తు ఫారాలలో కులమత ప్రస్తావనలుండవో
ఎక్కడ విద్య యూనిఫారాల చాటున అహంకారానికి గురికాదో
ఎక్కడ యువత ఆధునికత ముసుగులో మిధ్యాప్రలోభాలకు లొంగదో
ఎక్కడ శాస్త్రవేత్తల జీవితం సంఘర్షణాత్మకంగా ఉండదో
ఎక్కడ శాస్త్రపరిశోధన నవీన మూఢత్వాన్ని పెంచిపోషించదో
ఎక్కడ "మానవత్వం" బదులుగా మతాలు మార్గాలుగా చలామణి కావో
ఎక్కడ జ్యోతిష్యంకంటే వ్యాపార విశ్లేషణలు గొప్పవనే మూర్ఖత్వం రాజ్యమేలదో
ఎక్కడ ప్రజాస్వామ్యం మాటున రాజరికం నియంతృత్వాన్ని సాగించదో
ఎక్కడ రాజకీయం వ్యాపారంగానూ, వ్యాపారం రాజకీయంగానూ మారదో
ఎక్కడ ప్రభుత్వాలు ప్రజాసంక్షేమ పథకాలపేరిట ప్రజలను అజ్ఞానంలో ఉంచవో
అటువంటి స్వేచ్చాసభ్య సమాజంలోకి. . . . . . .
ప్రభో. . . . . . .
నా ఈ పృథివీ ప్రజను మేల్కొలుపు. . . . . . . ."