Friday, February 26, 2010

కుండలినియనగానేమి?

ఒకానొక కాలములో కుండలినీశక్తిని సాధించడం అన్నది యోగసాధనలో అత్యంత ఉన్నతమైన స్థితి.
కాని మారిన కాల సమీకరణాలలో ( నేటి పరిస్థితులలో ) కుండలినిని సాధించడం అన్నది మొదటి మెట్టు.
నాకు లభించిన అనేకమైన పుస్తకాలలో, నేను చదివిన కుండలిని సంబంధిత సాహిత్యంలో నాకు బాగా నచ్చిన, ఏ మతలబులూ, మెలికలూ లేని ఈ వ్యాసం సాధకులకి యెంతోకొంత ఉపయోగపడుతుంది.
ఇది నేను ఎక్కడ రాసుకున్నానో నాకు గుర్తులేదు.

చిన్న అభ్యర్ధన ఏమిటంటే ఇది ఎవరు రచించారో ఎవరికైనా తెలిస్తే నాకూ తెలియచేయండి.

Wednesday, February 10, 2010

రవీంద్రులవారికి క్షమాపణలతో...................

రవీంద్రులవారి గీతాంజలి విశ్వవిఖ్యాత రచన అన్నది అందరికీ తెలిసిన విషయమే.
అయితే అందులోని "ఎక్కడ మనసు నిర్భయంగా......" అన్న భాగంలో
రవీంద్రులవారి ప్రార్ధన ఆ లార్డ్ చెవికెక్కినట్టు లేదు. అందుకనే ఇంకొంచెం విపులంగా
విన్నవించుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమోనని
నా ఈ చిన్న ప్రయత్నం.

"ఎక్కడ పుట్టుకతోనే మనిషి కులమతజాతివర్గవర్ణాలు నిర్దేశింపబడవో
ఎక్కడ బాల్యం కన్నవాళ్ళ అధికార దర్పానికి గురికాదో
ఎక్కడ విద్యాలయాల దరఖాస్తు ఫారాలలో కులమత ప్రస్తావనలుండవో
ఎక్కడ విద్య యూనిఫారాల చాటున అహంకారానికి గురికాదో
ఎక్కడ యువత ఆధునికత ముసుగులో మిధ్యాప్రలోభాలకు లొంగదో
ఎక్కడ శాస్త్రవేత్తల జీవితం సంఘర్షణాత్మకంగా ఉండదో
ఎక్కడ శాస్త్రపరిశోధన నవీన మూఢత్వాన్ని పెంచిపోషించదో
ఎక్కడ "మానవత్వం" బదులుగా మతాలు మార్గాలుగా చలామణి కావో
ఎక్కడ జ్యోతిష్యంకంటే వ్యాపార విశ్లేషణలు గొప్పవనే మూర్ఖత్వం రాజ్యమేలదో
ఎక్కడ ప్రజాస్వామ్యం మాటున రాజరికం నియంతృత్వాన్ని సాగించదో
ఎక్కడ రాజకీయం వ్యాపారంగానూ, వ్యాపారం రాజకీయంగానూ మారదో
ఎక్కడ ప్రభుత్వాలు ప్రజాసంక్షేమ పథకాలపేరిట ప్రజలను అజ్ఞానంలో ఉంచవో
అటువంటి స్వేచ్చాసభ్య సమాజంలోకి. . . . . . .
ప్రభో. . . . . . .
నా ఈ పృథివీ ప్రజను మేల్కొలుపు. . . . . . . ."