Friday, January 15, 2010

శతాబ్దిలో అత్యంత సుదీర్ఘ సూర్యగ్రహణం

శతాబ్దిలోకెల్లా అత్యంత సుదీర్ఘ కాలంపాటు సంభవించే సూర్యగ్రహణం
రోజు ఏర్పడనుంది. మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ లో ప్రారంభం అయ్యే గ్రహణం
కెమరూన్, కాంగో, ఉగాండా మీదుగా ప్రయాణించి నైరోబి, కెన్యాలను
దాటుకొని హిందూమహాసముద్రం మీదకు ప్రవేశించును. అక్కడ ఉన్న
మాల్దీవులలో అత్యంత సుదీర్ఘ కాల సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది.
ఇక్కడ ౧౦ని. సె. పాటు సూర్యగ్రహణం కొనసాగుతుందని
పరిశోధకులు వెల్లడించారు.

భారతీయ కాలమాన ప్రకారం ఉదయం ౧౧ గం. ౧౭ ని. మొదలై
మధ్యాహ్నం గం. ౪౭ ని. లకు గ్రహణం అంతమవుతుంది.
మధ్యాహ్నం గం. ౨౦ ని. లకు తిరువనంతపురం లో
సూర్యాగ్రహణం భారత భూభాగంలో ప్రవేశిస్తుంది. ౧౦ని. ౪సె.
పాటు ప్రయాణించి రామేశ్వరం వద్ద భారత భూభాగానికి
వీడ్కోలు చెబుతుంది. సూర్యగ్రహణం యొక్క మధ్య రేఖ
భారత భూభాగంపై తమిళనాడు లోని ధనుష్కోటి
మీదుగా పోవును.

క్రీ..౧౯౯౨ జనవరి తేదీన ఏర్పడిన ౧౧ని.౪౧సె.
(ఇదే ఇప్పటి వరకు అత్యంత సుదీర్ఘ సూర్యగ్రహణం)
సూర్యగ్రహణం నుంచి, క్రీ.. ౩౦౪౩, డిసెంబర్ ౨౩
ఏర్పడబోయే ౧౧ ని. . సె. సూర్యగ్రహణం వరకు,
రోజు ఏర్పడే సూర్యగ్రహణమే
అత్యంత సుదీర్ఘ కాల సూర్యగ్రహణం.

Saturday, January 9, 2010

అసలేం జరిగిందంటే.... శ్రీ పి.వి.ఆర్.కె. prasAd

పుస్తకం పేరు : అసలేం జరిగిందంటే.....
రచయిత : పి.వి.ఆర్.కె. ప్రసాద్

ఒక అద్భుతమైన పుస్తకం....
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం....
ప్రభుత్వాదికారుల జీవితమంటే పూల పాన్పు కాదని,
అదొక పరమపదసోపానమని నిర్ధారించిన పుస్తకం.
విద్యార్ధులకి ఇదొక గైడ్ లా ఉపయోగపడుతుంది.
రాజకీయాలను, ప్రభుత్వ పరిపాలనను సమాంతరంగా
వివరించిన తీరు చాలా బాగుంది.

అవసరమైనచోట ప్రభుత్వాధికారుల విధులను గురించి
ప్రసాద్ గారు ఇచ్చిన వివరణ విషయాన్ని సరిగా అర్ధం
చేసుకోడానికి ఎంతో తోడ్పడుతుంది.

ప్రస్తుతానికి 'ఖమ్మం పొమ్మంది...ఉప్పెన రమ్మంది' చాప్టర్
దగ్గర ఆగింది........

Friday, January 8, 2010

విచిత్ర వార్తాస్రవంతి...........

నిన్న రిలయన్స్ పై జరిగిన దాడులు అర్ధం లేనివిగా,
ఆవేశపూరితమైనవిగా అర్ధం చేసుకోవాలి.
ఇది కేవలం 'ప్లే ఆఫ్ ఫోర్త్ ఎస్టేట్'......

ఎవరికోసం అనేది విజ్ఞులైన దేశప్రజలూ అర్ధం చేసుకోవాలి.
ఈ ఫోర్త్ఎస్టేట్లో పనిచేసేవారే 'జర్నలిస్ట్' లు. మిగతా
మూడు ఎస్టేట్లలో - రెండు ఎస్టేట్లలో రాజకీయ నాయకులు,
ఒక ఎస్టేట్లో న్యాయవ్యవస్థ పని చేస్తుంటాయి.
కాబట్టి మేజారిటీని గౌరవించాలి..... కాబట్టి రెండు ఎస్టేట్లు
ఒక ఎస్టేట్ కే సేవలందిచడం సహజం. ప్రజలకి
న్యాయం చేయాల్సిన న్యాయ వ్యవస్థ,
ప్రజలని విద్యావంతులని చేయాల్సిన సమాచార వ్యవస్థ
రెండూ 'నిరంతర సేవా స్రవంతి' లా,
రాజకీ'యు'లకు సేవలందించడం శోచనీయం.......

౨౧వ పుస్తక ప్రదర్శనలో శ్రీ పి.వి.ఆర్.కే. ప్రసాద్ గారు
రచించిన పుస్తకావిష్కరణ సభలో శ్రీ వల్లీశ్వర రావు గారు ప్రసంగిస్తూ
- సీతాదేవి, నారదుణ్ణి శపిస్తూ, 'భూమి మీద సర్వకాలాలలోనూ
నీ సంతానం వర్ధిల్లుతారు' అని అన్నదట. ప్రస్తుత కలికాలంలో ఈ
జర్నలిస్ట్ లే నారద సంతానం అని ఆయన చెప్పినదానికి
అర్ధం. ఒక్క నారదుడికే అన్ని గొడవలైతే, ఇంతమంది
నారదుళ్ళకి ఈ మాత్రం గొడవలు సహజం.

ఇక్కడ వీళ్ళే సిద్దాంతం అనుసరిస్తారంటే, ఒక గొడవ
ప్రజలకి మరుపులోకి రావాలంటే, ఇంకో విషయాన్ని
(చిన్నదయినా పెద్ద రాద్దాంతంతో), వెలుగులోకి
తీసుకొని రావడం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఈ సిద్దాంతం వర్కవుట్ అయ్యేట్టు లేదు....

చూద్దాం..................ఏమవుతుందో..................