Friday, January 8, 2010

విచిత్ర వార్తాస్రవంతి...........

నిన్న రిలయన్స్ పై జరిగిన దాడులు అర్ధం లేనివిగా,
ఆవేశపూరితమైనవిగా అర్ధం చేసుకోవాలి.
ఇది కేవలం 'ప్లే ఆఫ్ ఫోర్త్ ఎస్టేట్'......

ఎవరికోసం అనేది విజ్ఞులైన దేశప్రజలూ అర్ధం చేసుకోవాలి.
ఈ ఫోర్త్ఎస్టేట్లో పనిచేసేవారే 'జర్నలిస్ట్' లు. మిగతా
మూడు ఎస్టేట్లలో - రెండు ఎస్టేట్లలో రాజకీయ నాయకులు,
ఒక ఎస్టేట్లో న్యాయవ్యవస్థ పని చేస్తుంటాయి.
కాబట్టి మేజారిటీని గౌరవించాలి..... కాబట్టి రెండు ఎస్టేట్లు
ఒక ఎస్టేట్ కే సేవలందిచడం సహజం. ప్రజలకి
న్యాయం చేయాల్సిన న్యాయ వ్యవస్థ,
ప్రజలని విద్యావంతులని చేయాల్సిన సమాచార వ్యవస్థ
రెండూ 'నిరంతర సేవా స్రవంతి' లా,
రాజకీ'యు'లకు సేవలందించడం శోచనీయం.......

౨౧వ పుస్తక ప్రదర్శనలో శ్రీ పి.వి.ఆర్.కే. ప్రసాద్ గారు
రచించిన పుస్తకావిష్కరణ సభలో శ్రీ వల్లీశ్వర రావు గారు ప్రసంగిస్తూ
- సీతాదేవి, నారదుణ్ణి శపిస్తూ, 'భూమి మీద సర్వకాలాలలోనూ
నీ సంతానం వర్ధిల్లుతారు' అని అన్నదట. ప్రస్తుత కలికాలంలో ఈ
జర్నలిస్ట్ లే నారద సంతానం అని ఆయన చెప్పినదానికి
అర్ధం. ఒక్క నారదుడికే అన్ని గొడవలైతే, ఇంతమంది
నారదుళ్ళకి ఈ మాత్రం గొడవలు సహజం.

ఇక్కడ వీళ్ళే సిద్దాంతం అనుసరిస్తారంటే, ఒక గొడవ
ప్రజలకి మరుపులోకి రావాలంటే, ఇంకో విషయాన్ని
(చిన్నదయినా పెద్ద రాద్దాంతంతో), వెలుగులోకి
తీసుకొని రావడం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఈ సిద్దాంతం వర్కవుట్ అయ్యేట్టు లేదు....

చూద్దాం..................ఏమవుతుందో..................

No comments: