Wednesday, February 10, 2010

రవీంద్రులవారికి క్షమాపణలతో...................

రవీంద్రులవారి గీతాంజలి విశ్వవిఖ్యాత రచన అన్నది అందరికీ తెలిసిన విషయమే.
అయితే అందులోని "ఎక్కడ మనసు నిర్భయంగా......" అన్న భాగంలో
రవీంద్రులవారి ప్రార్ధన ఆ లార్డ్ చెవికెక్కినట్టు లేదు. అందుకనే ఇంకొంచెం విపులంగా
విన్నవించుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమోనని
నా ఈ చిన్న ప్రయత్నం.

"ఎక్కడ పుట్టుకతోనే మనిషి కులమతజాతివర్గవర్ణాలు నిర్దేశింపబడవో
ఎక్కడ బాల్యం కన్నవాళ్ళ అధికార దర్పానికి గురికాదో
ఎక్కడ విద్యాలయాల దరఖాస్తు ఫారాలలో కులమత ప్రస్తావనలుండవో
ఎక్కడ విద్య యూనిఫారాల చాటున అహంకారానికి గురికాదో
ఎక్కడ యువత ఆధునికత ముసుగులో మిధ్యాప్రలోభాలకు లొంగదో
ఎక్కడ శాస్త్రవేత్తల జీవితం సంఘర్షణాత్మకంగా ఉండదో
ఎక్కడ శాస్త్రపరిశోధన నవీన మూఢత్వాన్ని పెంచిపోషించదో
ఎక్కడ "మానవత్వం" బదులుగా మతాలు మార్గాలుగా చలామణి కావో
ఎక్కడ జ్యోతిష్యంకంటే వ్యాపార విశ్లేషణలు గొప్పవనే మూర్ఖత్వం రాజ్యమేలదో
ఎక్కడ ప్రజాస్వామ్యం మాటున రాజరికం నియంతృత్వాన్ని సాగించదో
ఎక్కడ రాజకీయం వ్యాపారంగానూ, వ్యాపారం రాజకీయంగానూ మారదో
ఎక్కడ ప్రభుత్వాలు ప్రజాసంక్షేమ పథకాలపేరిట ప్రజలను అజ్ఞానంలో ఉంచవో
అటువంటి స్వేచ్చాసభ్య సమాజంలోకి. . . . . . .
ప్రభో. . . . . . .
నా ఈ పృథివీ ప్రజను మేల్కొలుపు. . . . . . . ."

2 comments:

durgeswara said...

mamchi nivedana

baagumdi konasaagimchamdi

Anonymous said...

very good
keep it up
but i don't agree with your 9th line.